పంటల ధర ప్రచార పత్రాల ఆవిష్కరణ
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

పంటల ధర ప్రచార పత్రాల ఆవిష్కరణ

ఇ-క్రాప్‌లో నమోదు తప్పనిసరి


గిట్టుబాటు ధరల ప్రచార పత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలపై అవగాహన కల్పించే ప్రచార పత్రాలను నగరంలోని విడిది కార్యాలయంలో కలెక్టర్‌ జె.నివాస్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 సంవత్సర పంటల మద్దతు ధరలను సీజన్‌కు ముందే మద్దతు ధరలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కనీస మద్దతు ధరలకు రైతులు తమ పంటలను విక్రయించుకోవాలంటే.. ఆయా పంటల వివరాలను తప్పనిసరిగా ఇ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కె.మాధవీలత, విజయవాడ సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, గుడివాడ, నూజివీడు ఆర్డీవోలు జి.శ్రీనుకుమార్‌, కె.రాజ్యలక్ష్మి, డీడీఎం ఎం.దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని