అమ్మకు ‘పరీక్ష’
eenadu telugu news
Updated : 29/07/2021 12:28 IST

అమ్మకు ‘పరీక్ష’

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా శాఖ బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహిసోంది. అందులో భాగంగా ప్రశ్నాపత్రాలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అందజేశారు. మాగల్లు ఎంపీయూపీ పాఠశాలలో గోనుగుంట్ల హేమసాయి ఐదో తరగతి చదువుతోంది. బుధవారం ఆ చిన్నారి చేత తల్లి రమాదేవి పరీక్ష రాయిస్తోంది. మరికొందరు పిల్లలు కూడా చెట్టు కింద పరీక్షలు రాశారు.

- నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

 


మూడో దశకు... ముందస్తు సన్నద్ధం

ఆస్పత్రికి చేరుకున్న నియోనేటల్‌ వెంటిలేటర్లు

విజయవాడలోని పాతప్రభుత్వ ఆసుపత్రిలోని మాతాశిశుసంక్షేమ విభాగానికి కేవలం కృష్ణా జిల్లా నుంచే కాకుండా తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల నుంచి కూడా గర్భిణులు ప్రసవాల కోసం, చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడితే చికిత్స నిమిత్తం తీసుకొస్తుంటారు. కొవిడ్‌ మూడో దశ వస్తే చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని పీడియాట్రిక్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఆధునికీకరించి సిద్ధం చేస్తున్నారు. నియోనేటల్‌ వెంటిలేటర్లు, పడకలు, సీప్యాప్‌లను ఉంచారు. పీఎం కేర్‌(ప్రధాన మంత్రి కేర్స్‌) నుంచి ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వైద్య పరికరాలన్నీ ఇక్కడికి చేరుకున్నాయి.మూడో దశను ఎదుర్కోవడానికి ప్రతి జిల్లాకు కేటాయించిన నిధులలో భాగంగా రూ.7కోట్ల నిధులను విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాటిని పీడియాట్రిక్‌ విభాగంలో సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారు.ఆగస్టు 31వ తేదీ లోపు పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


సిద్ధం చేస్తున్న మంచాలు

-ఈనాడు, అమరావతి


బెంగాల్‌ కూలీలు... చకచకా నాట్లు...

కూలి పని చేసుకుని నాలుగురాళ్లు సంపాదించుకుందామని జిల్లాకు వచ్చిన పశ్చిమబంగ రైతు కూలీలు వీరు. మనకూలీలు 14 మంది రోజుకు ఎకరా పొలంలో నాట్లేస్తే.. బెంగాల్‌ కూలీలు రెండెకరాలు రోజులో పూర్తి చేస్తారని జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన రైతు శ్రీనివాసులు చెబుతున్నారు. స్థానిక కూలీలకు ఎకరాకు రూ.5వేలు ఇస్తుండగా.. వీరు రూ.4 వేలకే పని చేస్తున్నారు. జిల్లాలోని పెనమలూరు, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఈ సీజన్లో పని కోసం వచ్చి అయిపోగానే సొంత రాష్ట్రానికి వెళ్లిపోతారు.

-ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని