‘అక్రమాలను అడ్డుకుంటే అరెస్టులా..?’
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

‘అక్రమాలను అడ్డుకుంటే అరెస్టులా..?’


మాట్లాడుతున్న మహమ్మద్‌ నసీర్‌

పట్టాభిపురం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజా సంపదను దోచుకుంటున్నారని, వాటిని అడ్డుకుని ప్రశ్నిస్తే తెదేపా నేతలపై దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమా కారుపై వైకాపా గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైకాపా నేతలు ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరపున తెదేపా నేతలు అడ్డుకోవడం తప్పా? తప్పుడు పనులు అడ్డుకుంటే దాడులు, హత్యాయత్నాల కేసులు బనాయిస్తారా. అధికార పార్టీ నేతలు చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వైకాపా నేతలు చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే దేవినేని ఉమాపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి’.. అని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని