సీజీఎం విజయకుమార్‌ మృతి
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

సీజీఎం విజయకుమార్‌ మృతి


విజయకుమార్‌ (పాతచిత్రం)

గుంటూరు విద్యుత్తు, న్యూస్‌టుడే: కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థలో చీఫ్‌ జనరల్‌ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న ఎం.విజయకుమార్‌(59) బుధవారం మరణించారు. గుంటూరు సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరుగా పని చేస్తున్న విజయకుమార్‌ ఇటీవలే విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అనంతరం కొవిడ్‌ బారిన పడి విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు రెండు నెలలు కొవిడ్‌తో పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. విజయకుమార్‌ భౌతికకాయాన్ని గుంటూరులోని ఇంటికి తీసుకురాగా.. పలువురు ఉద్యోగులు, నగర ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని