బ్యారేజీ నుంచి దిగువకు 35,939 క్యూసెక్కులు
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

బ్యారేజీ నుంచి దిగువకు 35,939 క్యూసెక్కులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 35,939 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఎగువ నుంచి 26,250 క్యూసెక్కులు చేరుతుండగా, కాలువలకు 9,689 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులు కాగా 35 గేట్లను ఒక అడుగు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని