సెప్టెంబరు 11న జాతీయ లోక్‌అదాలత్‌
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

సెప్టెంబరు 11న జాతీయ లోక్‌అదాలత్‌

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: జిల్లాలోని కోర్టుల్లో సెప్టెంబరు 11న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తామని జిల్లా జడ్జి వై.లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు .మచిలీపట్నంతోపాటు గుడివాడ, విజయవాడ, నందిగామ, నూజివీడు, మైలవరం, జగ్గయ్యపేట, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, గన్నవరం, అవనిగడ్డ, మొవ్వ, ఉయ్యూరు కోర్టుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, ఎక్సైజ్‌, చెక్‌బౌన్సు కేసులు, మోటారు వాహన ప్రమాద, అన్ని రకాల సివిల్‌ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని