ఇచ్చేది మూడు మాత్రలే..!
eenadu telugu news
Published : 05/08/2021 06:23 IST

ఇచ్చేది మూడు మాత్రలే..!

గుంటూరు వైద్యం: సర్వజనాసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అవసరమైన యాంటీఫంగల్‌ టాబ్లెట్లు మూడే ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లోని ఔషధాల పంపిణీ కేంద్రం వద్దకు బుధవారం వచ్చిన రోగుల సహాయకులకు రోగికి ఒక్క రోజుకి సరిపోయే మోతాదులోనే మాత్రలు పంపిణీ చేశారని వాపోతున్నారు. ఈ ఔషధాలు వాడకపోతే వ్యాధి తీవ్రత పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నందున వీటి కోసం జీజీహెచ్‌ చుట్టూ రోజూ తిరగలేక అల్లాడిపోతున్నామని తెలిపారు. కనీసం 15 రోజులకు అవసరమైన మందులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని