AP News: జగనన్న పచ్చతోరణం.. మొక్క నాటిన ఏపీ సీఎం
eenadu telugu news
Updated : 05/08/2021 13:23 IST

AP News: జగనన్న పచ్చతోరణం.. మొక్క నాటిన ఏపీ సీఎం

మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ ప్రాంగణంలో ‘జగనన్న పచ్చతోరణం.. వనమహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23శాతం అడవులు మాత్రమే ఉన్నాయని.. వాటిని 33 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. చెట్ల పంపకం వల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. అనంతరం చెట్ల పరిరక్షణపై అక్కడున్న వారితో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్‌ పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని