విద్యుత్తు నియంత్రికల చోరీపై ఫిర్యాదు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

విద్యుత్తు నియంత్రికల చోరీపై ఫిర్యాదు

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యుత్తు ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : జిల్లాలో వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికల్లోని రాగి తీగలను దొంగిలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యుత్తు ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి గురువారం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కోరారు. మచిలీపట్నం కార్యాలయంలోని ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇటీవల కొందరు దొంగలు వ్యవసాయ విద్యుత్తు మోటార్ల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికలను ధ్వంసం చేసి, రాగి తీగను దొంగిలిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించి, దొంగతనాలను అరికట్టేందుకు నిఘా పెంచుతామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సాంబశివరావు, ఏఈ టెక్నికల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని