ఇంటర్‌ జోనల్‌ మహిళా క్రికెట్‌ ఛాంపియన్‌ సౌత్‌ జోన్‌
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

ఇంటర్‌ జోనల్‌ మహిళా క్రికెట్‌ ఛాంపియన్‌ సౌత్‌ జోన్‌


విజేతగా నిలిచిన సౌత్‌ జోన్‌ జట్టు సభ్యులు 

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో నిర్వహించిన ఏసీఏ ఇంటర్‌ జోనల్‌ సీనియర్‌ మహిళా వన్డే క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని సౌత్‌ జోన్‌ జట్టు 8 పాయింట్లతో కైవసం చేసుకుంది. సెంట్రల్‌ జోన్‌ జట్టు నాలుగు పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో సెంట్రల్‌ జోన్‌ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌ జట్టు 47.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఎం.భావన (30), ఆర్‌.కల్పన (27) రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు జి.చంద్రలేఖ (3/22), డి.ప్రవల్లిక (2/16) మెరిశారు. సౌత్‌ జోన్‌ జట్టు 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో ఎ.శిరీష (55 నాటౌట్‌), కె.హంస (34) సత్తా చాటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని