పులిచింతలకు వరద హెచ్చరిక
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

పులిచింతలకు వరద హెచ్చరిక

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం రాత్రికి ఒక లక్షన్నర క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం విడుదల చేసే అవకాశం ఉన్నందున నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఈఈ శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల వరద ప్రవాహం అధికంగా వస్తుందన్నారు. రాత్రి 7 గంటలకు 8 రేడియల్‌ గేట్లు తెరచి దిగువకు 93,036 క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తికి 10,000 క్యూసెక్కులు, లీకేజి ద్వారా 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,03,436 క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజికి వెళ్తోందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. ఎగువ టెయిల్‌ఫాండ్‌, నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతం నుంచి అంతే మొత్తం నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 33.31 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని