నేటి నుంచి పీసెట్‌ ఎంపికలు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

నేటి నుంచి పీసెట్‌ ఎంపికలు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంపికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1857 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి రోజు 427 మందికి పోటీలు నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు అబ్బాయిలు, ఆఖరి రోజు అమ్మాయిలకు పోటీలుంటాయి. 100, 800, లాంగ్‌, హైజంప్‌, షాట్‌పుట్‌లతో పాటు ఏదైన క్రీడలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థి ఒక పరుగు, ఒక జంప్‌, షాట్‌పుట్‌తో పాటు ఏదైన క్రీడలో పాల్గొనాలి. విద్యార్థినులకు 100, 400, లాంగ్‌, హైజంప్‌, షాట్‌పుట్‌లతో పాటు ఏదైన క్రీడలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థిని ఒక పరుగు, జంప్‌ కాని, షాట్‌పుట్‌తో పాటు ఏదైనా ఓ క్రీడలో కానీ పాల్గొనాలి. ఎంపికకు వచ్చే విద్యార్థులు, అధికారులు మాస్కులు కచ్చితంగా ధరించాలని కన్వీనర్‌ జాన్సన్‌ చెప్పారు. ‘ప్లే ఫీల్డ్స్‌’ను శానిటైజ్‌ చేశామని చెప్పారు. ప్రవేశ మార్గంలో శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఈ ఎంపికలను నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని