పులిచింతలకు పెరుగుతున్న వరద
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

పులిచింతలకు పెరుగుతున్న వరద

అచ్చంపేట, న్యూస్‌టుడే: తుపాను కారణంగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఆదివారం రాత్రికి లక్ష క్యూసెక్కుల వరకు వరద పెరుగుతుందని ఈఈ ఆర్‌.శ్యాంప్రసాద్‌ తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాత్రి ఏడు గంటలకు దిగువకు నాలుగు రేడియల్‌ గేట్లు తెరచి 62,669 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 10,000 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 73,069 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్తోందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతం నుంచి 66,328 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 33.27 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని