ఎస్పీ బాలుకు గాయకుల స్వరాభిషేకం
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

ఎస్పీ బాలుకు గాయకుల స్వరాభిషేకం


పురస్కార గ్రహీతలతో నిర్వాహకులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: కళాదర్బార్‌ ఆంధ్రప్రదేశ్‌, ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం రాత్రి ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా పురస్కార ప్రదానాలు, సంగీత విభావరి జరిగాయి. కార్యక్రమాన్ని కళాదర్బార్‌ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు నిర్వహించారు. గాయనీగాయకులు రామాచారి, శశికళ, యోగిసురేష్‌, శ్రీధర్‌ అయ్యర్‌, లిప్సిక, సాకేత్‌, హరిణి, సాయిచరణ్‌లు బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కన్నుమూసిన సీనియర్‌ సినీగాయకుడు జి.ఆనంద్‌ పేరున స్మారక అవార్డులను రాము, విజయలక్ష్మి, వినోద్‌బాబులకు అందించారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గుంటూరు శాఖ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అతిథులుగా పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. బాలు స్వరాభిషేకం పేరున జరిగిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని