సముద్రంలో మునిగి తెనాలి యువకుడి మృతి
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

సముద్రంలో మునిగి తెనాలి యువకుడి మృతి

మరొకరి కోసం గాలింపు

టీనగర్‌, న్యూస్‌టుడే: చెన్నైలోని ఎలియడ్స్‌ తీరం వద్ద సముద్రంలో గల్లంతై ఓ యువకుడు మృతిచెందగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన శైలేష్‌ బాబు (17) చెన్నై తరమణిలోని ఓ కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. అతన్ని కలిసేందుకు రెండ్రోజుల క్రితం చెన్నై చేరుకున్న తన సోదరుడు మణి ప్రకాశ్‌ (19), బంధువు ప్రణీత్‌ కుమార్‌ (16)తో కలిసి చెన్నైలోని ఎలియడ్స్‌ సముద్ర తీరానికి వెళ్లాడు. అక్కడ సముద్రంలోకి దిగి ఆడుకుంటుండగా శైలేష్‌ బాబు, ప్రణీత్‌ కుమార్‌ అలల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శైలేష్‌ బాబు మృతదేహం చెన్నై పట్టినపాక్కంలో ఒడ్డుకు చేరింది. ప్రణీత్‌ కుమార్‌ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని