చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

చిత్ర వార్తలు

పర్యాటక ప్రాంతం... మందుబాబులకు నిలయం

- ఈనాడు అమరావతి

ట్టిసీమ నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ కృష్ణా జిల్లా ఇబ్రపీీాంపట్నం ఫెర్రి ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో కలిశాయి. రెండు నదుల పవిత్ర కలయికకు గుర్తుగా ఆ ప్రాంతానికి పవిత్ర సంగమం అని నామకరణం చేసి పర్యాటక స్థలంగా అభివృద్ధి చేశారు. 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాల నాటి నుంచి 2019 వరకు నిత్యం ఇక్కడ దీప కాంతుల మధ్య ఫంట్‌పై కృష్ణవేణికి నవ హారతులు ఇచ్చేవారు. అనంతరం ఫంట్‌ను దుర్గా ఘాట్‌కు తరలించారు. ఇక్కడ ఫంట్‌ నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం పవిత్ర సంగమం మందుబాబులకు అడ్డాగా మారింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి గత వైభవాన్ని తీసుకురావాలని పర్యాటకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


జై జవాన్‌..

విద్యాధరపురం, కొండపల్లి- న్యూస్‌టుడే

బంగ్లాదేశ్‌ విభజన సందర్భంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతసైన్యం సాధించిన విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌ ఏఓసీ సెంటరు నుంచి ఏపీ, తెలంగాణకు చెందిన సైనికులు చేపట్టిన సైకిల్‌ ర్యాలీ నల్గొండ, గద్వాల్‌, గుంటూరు, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఆదివారం నగరానికి చేరుకుంది. లెఫ్టెనెంట్‌ కల్నల్‌ లక్ష్మణ్‌ బృందానికి బ్యారేజీ వద్ద వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌ స్వాగతం పలికారు. అల్పాహారం,  తాగునీరు అందజేశారు. అక్కడి నుంచి వారు కొండపల్లి కోటకు చేరుకున్నారు.


కొండ రాళ్లకు అడ్డుగోడ

-ఈనాడు, విజయవాడ

నాడు

తేడాది దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై గాలిగోపురం ఎదురుగా ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. వెంటనే రాళ్లను తొలగించి నీళ్లతో నింపిన డ్రమ్ములు అడ్డంపెట్టారు. తర్వాత కొండకు ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొండరాళ్లు పడినా ముందుకు చొచ్చుకురాకుండా గాలిగోపురం ఎదురుగా ఉన్న వినాయకుని గుడి సమీపం నుంచి సమాచార కేంద్రం వరకు రాళ్లతో గోడను నిర్మిస్తున్నారిలా..

నేడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని