సజావుగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలు
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

సజావుగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల నిమిత్తం ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 31 కేంద్రాల్లో 5,514 మంది విద్యార్థులకు గానూ 5,280మంది హాజరయ్యారని, 234మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా తెలిపారు. ఆమె విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి వసతులపై విద్యార్థులను ఆరా తీశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు జరిగాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని