2న జవివే జాతీయ మహా సభలు
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

2న జవివే జాతీయ మహా సభలు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రాజకీయాలకతీతంగా ప్రజా సైన్స్‌ ఉద్యమాన్ని ముందుకు నడిపించే జనవిజ్ఞాన వేదిక (జవివే) 4వ జాతీయ మహా సభలను అక్టోబరు 2న నగరంలోని సిద్ధార్థ అకాడమీ కళావేదికలో నిర్వహిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జంపా కృష్ణ కిషోర్‌ తెలిపారు. కార్యక్రమ బ్రోచర్‌ను ఆదివారం ప్రెస్‌ క్లబ్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1998, ఫిబ్రవరి 28న జవివే ఆవిర్భవించినట్లు చెప్పారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, ఆరోగ్యం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, మూఢ నమ్మకాలు, జ్యోతిష్యం వంటి వాటిపై అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎస్‌.రాఘవరాజు, నగర అధ్యక్షుడు చంద్రరావు, కార్యదర్శి రవిబాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని