గుమాస్తానే.. దొంగ
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

గుమాస్తానే.. దొంగ

రూ.6.50 లక్షల నగదు స్వాధీనం

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : ఈ నెల 23వ తేదీ రాత్రి సత్యనారాయణపురంలో ఓ వ్యాపారి నుంచి నగదు దోచుకున్న ఘటనలో.. అదే దుకాణంలో పనిచేసే గుమస్తానే ప్రధాన నిందితుడిగా తేలింది. ముగ్గురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. రోల్డు గోల్డ్‌ వ్యాపారి ఎస్‌.కోటేశ్వరరావు వ్యాపారం ముగించుకుని ఈనెల 23వ తేదీ రాత్రి ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో చేతిలోని నగదు సంచిని ఇద్దరు యువకులు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. వించిపేటకు చెందిన పల్లంటి మోహన్‌ ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఇతడు సదరు వ్యాపారి దుకాణంలోనే గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడికి సహాయపడిన విద్యాధరపురానికి చెందిన ఎం.భవానీ సందీప్‌.. వ్యాపారి ఎస్‌.కోటేశ్వరరావు పక్క దుకాణంలోనే పనిచేస్తాడు. మూడో వ్యక్తి కొత్తపేటకు చెందిన ఎస్‌.శివనారాయణ సెల్‌ఫోన్లు రిపేరు చేస్తుంటాడు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన నగదుతో పాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవడంలో కృషిచేసిన ఏసీపీ షేక్‌ షాను, సీఐ బాలమురళీకృష్ణ, క్రై ఎస్సై షరీఫ్‌ తదితర సిబ్బందిని సీపీ బి.శ్రీనివాసులు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని