జాతీయ సమైక్యతే ధ్యేయం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

జాతీయ సమైక్యతే ధ్యేయం


మాట్లాడుతున్న ఆలిండియా మిల్లీ కౌన్సిల్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముస్తఫా రిఫాయి 

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: మనదేశంలో ఎన్నో జాతులు, వర్గాలు నివసిస్తున్నారని, వారి మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం, సమభావన, సామరస్య పూరిత భావాన్ని కలిగించేలా అందరూ తమ వంతు కృషి చేయాలని ఆల్‌ ఇండియా మిల్లీ కౌన్సిల్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముస్తపా రిఫాయి అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్‌ మిల్లీ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముస్తఫా హాజరై ఆయన మాట్లాడుతూ అక్షరజ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతిభ ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యను అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ కార్యవర్గసభ్యులు సులేమాన్‌ ఖాన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఖదీర్‌ నిజామి, రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మునీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ మిల్లీ కౌన్సిల్‌ ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని దేశాభివృద్ధికి, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని వివరించారు. జాతీయ సమైక్యత కోసం ప్రభుత్వాలు, సంస్థలు మాత్రమే కాకుండా దేశంలోని అందరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మోడ్రన్‌ గ్రూప్‌ అధినేత శుక్రి, నూరిషా జామాత్‌ అధ్యక్షుడు అదిల్‌, ముఫ్తి మహ్మద్‌, యూసఫ్‌ అలీ, మహమ్మద్‌ యూనుస్‌, అబ్దుల్‌ మతీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్‌కు సంబంధించి 12 అనుబంధ విభాగాల బాధ్యులను నియమించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని