హక్కుల పరిరక్షణకు కృషి
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

హక్కుల పరిరక్షణకు కృషి


మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: సమాజంలో మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు సంఘం సభ్యులు అండగా నిలబడి సమస్యను పరిష్కరించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మొగల్రాజపురంలోని అమ్మ కల్యాణ మండపంలో గ్లోబల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవేర్‌నెస్‌ అసోసియేషన్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళల్లో అక్షరాస్యత పెరిగితేనే చట్టాలపై అవగాహన ఏర్పడి, చైతన్యం కలుగుతుందని సూచించారు. మహిళాభ్యున్నతి కోసం పోరాడిన సావిత్రిబాయి ఫులే, మలాలా, తాలిబాన్లకు ఎదురొడ్డి నిలిచిన అతివలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా మాట్లాడుతూ పోలీస్‌శాఖ మానవ హక్కుల పరిరక్షణకు నిత్యం కృషి చేస్తోందని తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షుడు కాసల కోనయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులు భంగం కలిగినప్పుడు తాము అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్తిపాటి సురేష్‌కుమార్‌, రీజనల్‌ ఛైర్మన్‌ ఎస్‌డీ లాల్‌, రాష్ట్ర సినీ విభాగపు ఛైర్మన్‌ దుగ్గిరాల రవి, జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటసాయి, జాతీయ యువజన విభాగం ఛైర్మన్‌ శశిధర్‌, డైరెక్టర్‌ ఆంజనేయులు, సౌత్‌ ఇండియా ఛైర్మన్‌ పి.రాజు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని