తితిదేకు రెండు టన్నుల చక్కరకేళి వితరణ
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

తితిదేకు రెండు టన్నుల చక్కరకేళి వితరణ


వాహనానికి జెండా ఊపుతున్న పైడిపాటి త్రినాథ్‌ 

పటమట, న్యూస్‌టుడే : వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు అందించే నిత్యప్రసాదంలో తమ వంతు సహకారాన్ని అందించడం పూర్వ జన్మసుకృతమని దాత కొండేటి శశికుమార్‌ అన్నారు. ఆదివారం నిర్మల కాన్వెంట్‌లో రోడ్డులోని మిఠాయి దుకాణం నుంచి ఆయన తితిదేకు రెండు టన్నుల ఎర్ర చక్కరకేళిని పంపించారు. ఈ సందర్భంగా మిఠాయి అధినేత పైడిపాటి త్రినాథ్‌ లారీకి జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా శశికుమార్‌ మాట్లాడుతూ తొలిసారిగా మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో నగరం నుంచి ప్రసాదాన్ని పంపించామని తెలిపారు. ఆమెరికాలో ఉండే కనపర్తి వెంకన్నబాబు ఈ వితరణలో భాగస్వాములయ్యారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని