కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించాలి
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించాలి


బాధిత కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, బాబూరావు తదితరులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.4 లక్షలు పరిహారాన్ని అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. రాణిగారితోటలో కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో దేశంలో అనేక మంది మరణించినప్పటికీ ఆయా కుటుంబాలను ఇప్పటి వరకూ ప్రభుత్వాలు ఏవిధంగానూ ఆదుకోలేదన్నారు. ఇదే విషయంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా విపత్తు నివారణ నిధి నుంచి రూ.50 వేలు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. అయితే బాధితులకు రూ.4 లక్షలు కేంద్ర ప్రభుత్వమే పరిహారంగా అందించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తుందని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, బోజెడ్ల నాగేశ్వరరావు, ఎన్‌.హరినారాయణ, టి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని