AP News: కొడాలి నానితో వంగవీటి రాధా భేటీ
eenadu telugu news
Updated : 27/09/2021 09:40 IST

AP News: కొడాలి నానితో వంగవీటి రాధా భేటీ


మంత్రి నాని, వంగవీటి రాధాల మాటామంతి

గుడివాడ, న్యూస్‌టుడే: దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ తెదేపా తరఫున రానున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తారని కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. దీంతో నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగింది. దానికి భిన్నంగా ఆదివారం రాత్రి మంత్రి కొడాలి నాని ఫంక్షన్‌హాల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వంగవీటి రాధా హాజరై మంత్రి కొడాలి నాని, ఇతర వైకాపా నాయకులతో మాట్లాడారు. గదిలో వారంతా చర్చించుకోవడం, వేదిక వరకూ కలిసి రావడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు తెదేపాలో కొనసాగుతున్న రాధా వైకాపా గూటికి చేరతారనే ప్రచారం తిరిగి ప్రారంభమైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని