పరిశ్రమల స్థాపన, గోదాముల నిర్మాణానికి చేయూత
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

పరిశ్రమల స్థాపన, గోదాముల నిర్మాణానికి చేయూత


రైతులకు అవగాహన కల్పిస్తున్న నాబార్డు ఏజీఎం విజయ్‌, వేదికపై కేవీకే శాస్త్రవేత్తల బృందం

ఘంటసాల, న్యూస్‌టుడే: రైతులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, గోదాముల నిర్మాణాలకు బ్యాంకు రుణాలు, ఆర్థిక తోడ్పాటు అందిస్తామని విజయవాడ నాబార్డు ఏజీఎం టి.విజయ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘వాణిజ్య ఉత్సవ్‌ ’లో భాగంగా స్థానిక కృషీ విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అపెడా) సంయుక్తాధ్వర్యంలో ‘పరిశ్రమలు- వాణిజ్యం’ అంశంపై కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కె.ఝూన్సీ అధ్యక్షతన దివిసీమ రైతులకు స్థానిక కేవీకేలో ఆదివారం అవగాహన కల్పించారు. అపెడా క్షేత్ర అధికారి (ఎఫ్‌ఓ) డి.ధర్మారావు మాట్లాడుతూ రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితే పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. సీనియర్‌ శాస్త్రవేత్త పి.సుధాజాకబ్‌ మాట్లాడుతూ రైతులు స్వయంగా నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవాలన్నారు. సీనియర్‌ శాస్త్రవేత్తలు శ్రీలత, మంజువాణి, ఏవో కె.మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని