సజావుగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

సజావుగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు


పరీక్ష కేంద్రంలో పరిశీలిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్‌ ఇంజినీర్‌ ఎంపిక పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా బిషప్‌ అజరయ్య బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పరిశీలించారు.

28 నుంచి డిపార్ట్‌మెంటల్‌ ..

ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల నిర్వహణపై డీఆర్వో ఆదివారం సమీక్ష నిర్వహించారు. అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏపీపీఎస్సీ, రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్‌ ఏవో వెన్నెల శ్రీను, హెచ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్యామ్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని