AP news: మంత్రి ఆదిమూలపు సురేష్‌తో ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ
eenadu telugu news
Updated : 27/09/2021 18:06 IST

AP news: మంత్రి ఆదిమూలపు సురేష్‌తో ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ

అమరావతి: ఏపీ సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు. డిగ్రీ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలల్లో కాంట్రాక్టు, తాత్కాలిక లెక్చరర్ల సమస్యలపై మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. ఎయిడెడ్‌ కళాశాలల్లో అధ్యాపకుల సర్దుబాట్ల వల్ల కాంట్రాక్టు లెక్చరర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. దీంతో రేపు ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించాల్సిన ధర్నాను అధ్యాపక సంఘాలు వాయిదా వేసుకున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినట్లు అధ్యాపక సంఘాలు వెల్లడించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని