పఠాన్‌ బండి... బ్యాటరీతో పరుగెడుతోందండి
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

పఠాన్‌ బండి... బ్యాటరీతో పరుగెడుతోందండి

ఆటో, బ్యాటరీని అనుసందానించిన దృశ్యం

చిలకలూరిపేటకు చెందిన పఠాన్‌ సైదా (9వ తరగతి) ఇంధనం లేని లగేజి ఆటోకు రూపకల్పన చేశారు. కేవలం బ్యాటరీ సాయంతో 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి శబ్దం లేకుండా రహదారులపై పరుగులు తీస్తోంది. ఓ పాత లగేజీ ఆటోను తీసుకుని ఇంధనం లేకుండా కేవలం బ్యాటరీలతో నడిపేలా దాన్ని ప్రయోగాత్మకంగా తయారుచేశారు. 100 యామ్స్‌ సామర్థ్యం కలిగిన నాలుగు బ్యాటరీలు ఆటోలో అమర్చారు. వాటిని మోటారుకు అనుసంధానం చేశారు. సీటు కింద ప్లగ్‌పాయింట్‌ పెట్టకుని ఓ ప్రధాన బ్యాటరీ నుంచి మిగిలిన బ్యాటరీలకు పవర్‌ సరఫరా అయ్యేలా కంట్రోల్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశారు. బ్యాటరీలు ఫుల్‌ఛార్జింగ్‌ అయ్యేందుకు కనీసం మూడు గంటలు పడుతుంది. బ్యాటరీ నుంచి ఛార్జింగ్‌ డౌన్‌ అవుతున్నా తెలిసే ఏర్పాటు ఉంది. ఒకసారి  ఛార్జింగ్‌ ఎక్కిస్తే  50 కి.మీటర్లు వరకు ప్రయాణం సాగించొచ్చని సైదా తెలిపారు. నాలుగైదు క్వింటాళ్ల బరువు వరకు ఇవి భరిస్తాయి. బ్యాటరీలతో కలుపుకుని ఆటో బరువు 3 క్వింటాళ్ల దాకా ఉంటుంది. బ్యాటరీలకు సుమారుగా రూ.50-60 వేలవుతుంది. అదేవిధంగా ఛార్జింగ్‌కు రోజుకు రూ.10 లోపే కరెంటు కాలుతోంది. అదే 50కి.మీటర్ల దూరానికి డీజిల్‌ వాడితే రూ.220 ఖర్చవుతుంది.

-ఈనాడు-గుంటూరు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని