సమస్యలు అధిగమించాలంటే ఓర్పు, నేర్పు అవసరం
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

సమస్యలు అధిగమించాలంటే ఓర్పు, నేర్పు అవసరం

మాట్లాడుతున్న ఎసీˆ్ప సిద్ధార్థ్‌ కౌశల్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది, అధికారులు విధి నిర్వహణలో తలెత్తిన సమస్యలు సమయస్ఫూర్తితో అధిగమించే ఓర్పు, నేర్పులను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని  ఎసీˆ్ప సిద్ధార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు సీˆ్వకరించి మూడు నెలలు గడిచిన సందర్భంగా విజయవాడ లబ్బీపేటలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో జిల్లా పోలీసు అధికారులతో ఆయన ‘కాంప్రహెన్సివ్‌ పెర్ఫామెన్స్‌ రివ్యూ’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో ఏ పని ముందు చేయాలి? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడే నిర్దేశించుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయని ఎస్పీ అన్నారు. అక్రమ మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేసేందుకు మరింత కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎసీˆ్పలు ధర్మేంద్ర, మాసూం బాషా, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, సత్యానందం, రాజీవ్‌కుమార్‌, భరత్‌మాతాజీ, మురళీకృష్ణ, ఉమామహేశ్వరరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాలు ఇలా..
* ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, స్నేహ పూర్వక పోలీసింగ్‌ లక్ష్యంగా రోజూ స్పందన కార్యక్రమం నిర్వహణ.
* మహిళల భద్రతకు పెద్దపీట, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
* మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాల వద్దకే శాఖాపరమైన ప్రయోజనాలు అందించే వినూత్న కార్యక్రమం.
నీ అత్యాచార, గృహహింస బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి పరిస్థితులను సమీక్షించి పోలీస్‌శాఖ అండగా ఉంటుందన్న భరోసా కల్పించడం.
* విధి నిర్వహణలో ప్రతిభ చూపే కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై స్థాయి సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడం.
* పోలీసు సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ‘కెపాసిటీ బిల్డింగ్‌ ఫర్‌ బెటర్‌ పోలీసింగ్‌’ పేరుతో ఐటీ కోర్‌ విభాగాన్ని బలోపేతం చేయడం.
*ఐటీ కోర్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైబర్‌ విభాగాలను నవీకరించి శిక్షణ తరగతులు నిర్వహించి సైబర్‌ చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించడం.  
* ఈ-ఆఫీస్‌ పేరుతో కాగిత రహిత కార్యక్రమాల నిర్వహణ.
* సిబ్బందిలో శారీరక, మానసిక ఒత్తిడిని తొలగించేందుకు రోజు వారీ పరేడ్‌, యోగా తరగతులు చేపట్టడం.
* కేసుల విచారణను తెలుసుకునేందుకు ‘గ్రేవ్‌ ఎకనామిక్‌ అండ్‌ సైబర్‌ అఫెన్స్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (జికో) రూపకల్పనకు ప్రాధాన్యం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని