చిత్రవార్తలు
eenadu telugu news
Published : 23/10/2021 06:23 IST

చిత్రవార్తలు

ఒంటరైన బాహుబలి ఎద్దు

బాహుబలి చిత్రంలో నటించిన పొడవాటి కొమ్ములున్న ఎద్దులివి. కొమ్ములకు మంటలతో పరిగెత్తి.. అందరినీ ఔరా అనిపించాయి. చిత్ర నిర్మాణం కోసం గుజరాత్‌లో వీటిని కొనుగోలు చేశారు. చిత్ర నిర్మాణం పూర్తి కాగానే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలోని బంధువుకు నిర్మాత కానుకగా ఇచ్చారు. వాటిని పొలం పనులకు వినియోగించుకునేవారు. సంవత్సరం క్రితం ఒక ఎద్దు అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి మరొకటి దీనంగా ఒంటరిగా ఉంటోందని గుంటూరులోని సత్యసాయిబాబా ఆశ్రమానికి అప్పగించారు. ఆశ్రమంలో తోటి ఆవులు, ఎద్దులతో ఇలా ఉంటోంది.


శుభ్రం చేయించారు.. భద్రపరిచారు

టీకా శీతలీకరణ పెట్టెలను సిద్ధార్థ మెడికల్‌ కళాశాల వెనుక చెత్తలో పడేశారని ‘ఈనాడు’లో ఈ నెల 20న ‘ముప్పు తొలగలేదు మూలకు చేరాయి’ శీర్షికతో ప్రచురితమైన చిత్ర కథనం ప్రచురితమైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని స్పందించి సిబ్బందితో వాటిని శుభ్రం చేయించి భద్రపరిచారు.

  - ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని