close

శనివారం, ఆగస్టు 15, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీవారి పవిత్రోత్సవాలు పరిసమాప్తం 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం సాయంత్రం పరిసమాప్తం అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు. అనంతరం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీదేవి భూదేవి, శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయకుల మండపంలోకి తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో పూర్ణహూతి చేశారు. అనంతరం స్వామి వారు విమాన ప్రదక్షణగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో.. పవిత్రోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. ఈ కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో యోగి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.