ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి.. వేధింపులతో ఎనిమిది నెలలకే ఆత్మహత్య
eenadu telugu news
Updated : 05/08/2021 08:00 IST

ఫేస్‌బుక్‌లో పరిచయం.. పెళ్లి.. వేధింపులతో ఎనిమిది నెలలకే ఆత్మహత్య

రుద్రాక్ష్‌ మృతదేహం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : భార్య, అత్తమామల వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోధూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన తలండి రుద్రాక్ష్‌(28) అనే వ్యక్తి జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం మండలంలోని బర్దిపూర్‌ గ్రామశివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కూలీగా చేరాడు. అతడికి ఫేస్‌బుక్‌లో 8 నెలల క్రితం జయశ్రీ అనే యువతితో పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహం చేసుకున్నారు. నెల క్రితం జయశ్రీ తల్లిదండ్రులైన వినోద్‌, చంద్రబాగ్‌లు బర్దిపూర్‌ వచ్చి మా కూతురిని సరిగా చూసుకోవడం లేదని, నీకు ఎలాంటి ఆస్తి లేదంటూ రుద్రాక్ష్‌తో గొడవపడి, మానసికంగా వేధించారు. సోమవారం సాయంత్రం జయశ్రీ భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు గోధూర్‌ గ్రామశివారులోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న అక్క అగ్నిత దగ్గరకు వెళ్లి, రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటు సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నినిషా రెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని