Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో ఊడిపోయిన గేటు
eenadu telugu news
Updated : 05/08/2021 16:17 IST

Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో ఊడిపోయిన గేటు

గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నంబర్‌ గేటు ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వెళ్తోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉంది. నీరు ఎక్కువగా ఉండటంతో కొత్త గేటు అమర్చడం సాధ్యంకాదు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో తాత్కాలికంగా నీటిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. పోలవరం నుంచి నిపుణులను పిలిపించామని, రేపటిలోగా ఊడిపడిన గేటును తిరిగి బిగిస్తామని చెప్పారు.  ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేసిన దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేశామన్నారు.  ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు తగ్గితే గేట్ మరమ్మతులు చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు డైరెక్టర్‌ తెలిపారు. అలానే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉన్నందువల్ల తీర ప్రాంత ప్రజలు వాగులు, కాలువలు దాటవద్దని గుంటూరు కలెక్టర్‌ సూచించారు. ఈ మేరకు ముంపు ప్రాంత అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.  

 


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని