ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి నరసింహమూర్తి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రజలకు సులభతరంగా అందుబాటులో న్యాయసేవలు అందించేలా కృషి చేస్తున్నట్లు జిల్లా జడ్జి వై.నరసింహమూర్తి అన్నారు. శనివారం ఆయన జిల్లాలోని ఆయా డివిజన్ల తపాలా శాఖ సిబ్బందితో మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, భారత తపాలా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తపాలా శాఖల ద్వారా న్యాయసేవలు అనే నూతన పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి తపాలాశాఖ ఉద్యోగులు అందరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఉపయోగాలు, కొత్తగా రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ పనితీరు తదితర అంశాలపై వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్, న్యాయవాది చీలి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని