నేడు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

నేడు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : సెలవు దినమైనప్పటికీ ఆదివారం (నేడు) జిల్లాలోని వినియోగదారులు విద్యుత్తు బిల్లులు చెల్లించేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్తు ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం తెరిచి ఉంటాయని చెప్పారు. అలాగే ఏపీసీపీడీసీఎల్‌ కస్టమర్‌ యాప్, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, భీమ్, బిల్‌డెస్క్‌ల ద్వారా చెల్లించవచ్చని ఆయన వివరించారు. వినియోగదారులు తమ తమ ఇళ్ల వద్ద విద్యుత్తు లైన్లకు ఆరు అడుగుల దూరం పాటిస్తూ మొక్కలు పెంచుకోవాలని ఆ శాఖ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి కోరారు. వర్షాలు, గాలులు వీచినపుడు విద్యుత్తు లైన్లకు చెట్ల కొమ్మలు తగిలి తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని