మొక్కలు నాటి... ప్రముఖులను సత్కరించి...
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

మొక్కలు నాటి... ప్రముఖులను సత్కరించి...


 దేవినేని మధుసూదనరావు, జయశ్రీ దంపతులను సత్కరిస్తున్న ఓంకారేశ్వర్‌

ఈనాడు, అమరావతి: విజయవాడలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను పురస£్కరించుకుని ఆజాదీ క అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం శనివారం నిర్వహించారు. సామాజిక సేవ చేస్తున్న పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. నగరంలోని ఎం.జి.రోడ్డులో ఉన్న సెంట్రల్‌ రెవెన్యూ భవనం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ సి.హెచ్‌.ఓంకారేశ్వర్‌ పాల్గొన్నారు. ప్రముఖ సామాజిక సేవకులు దేవినేని మధుసూదనరావు, ఆయన సతీమణి దేవినేని జయశ్రీ, సిద్థార్థ అకాడమీ సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, చేయూత క్యాన్సర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.కృష్ణారెడ్డి తదితరులను ఈ సందర్భంగా సత్కరించారు. వచ్చిన అతిథులందరితో ఆదాయపన్ను శాఖ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు కె.ఎస్‌.రాజేంద్రకుమార్, ఎం.అనీల్‌కుమార్, బి.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని