బంద్‌ను విజయవంతం చేయాలని తీర్మానం
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

బంద్‌ను విజయవంతం చేయాలని తీర్మానం


తోటమూలలో మాట్లాడుతున్న రైతు సంఘం నేత నాగేశ్వరరెడ్డి

గంపలగూడెం, న్యూస్‌టుడే: రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించాలని పశ్చిమ కృష్ణా రైతు సంఘం అధ్యక్షుడు ఎస్‌.నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27న చేపట్టనున్న బంద్‌కు సంబంధించి శనివారం తోటమూలలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరారు. 23న గంపలగూడెంలో వాహనాలతో ప్రదర్శన చేయాలని, 27న అన్ని సంస్థలను మూయించాలని నిర్ణయించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.సీతారామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడ్లపల్లి రామకృష్ణ, ఎం.నవనీతం, సీపీఎం నాయకులు ఎం.వెంకటరెడ్డి, జి.వీరభద్రం, ఇ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

విస్సన్నపేట, న్యూస్‌టుడే: ఈనెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు శనివారం వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గాంధీబొమ్మ కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి మీదుగా లక్ష్మీటాకీస్‌ కూడలి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎం.త్యాగరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు మద్దతునిచ్చి, జయప్రదం చేయాలని కోరారు. నాయకులు మోతే శోభనాచలం, పొన్నగంటి కృష్ణప్రసాద్‌, పసుపులేటి వరప్రసాద్‌, పితాని నాగేశ్వరరావు, విస్సంపల్లి రాములు, మేడా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని