సచివాలయంలో రికార్డుల పరిశీలన
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

సచివాలయంలో రికార్డుల పరిశీలన

పెడనలోని 9వ నెంబరు వార్డు సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌

పెడన, న్యూస్‌టుడే: పెడనలోని 9వ నెంబరు వార్డు సచివాలయాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి(జీఏడీ) ప్రవీణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. బ్రహ్మపురంలోని సచివాలయానికి వెళ్లిన ఆయన అక్కడి రికార్డులను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. సచివాలయం మొదటి అంతస్తులో ఉండటంతో వీలైనంత త్వరలో మరో భవనానికి మార్చాలని కమిషనర్‌ ఎం.అంజయ్యను ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సచివాలయ ఏఎన్‌ఎం కటకం భార్గవిని ఆరా తీశారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి ఎంత మందికి టీకాలు వేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యారోగ్య శాఖ ద్వారా అమలు జరుగుతున్న పథకాలపై సమీక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని