వృద్ధులకు రక్షణగా అనేక చట్టాలు
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

వృద్ధులకు రక్షణగా అనేక చట్టాలు


వృద్ధులకు భోజనం వడ్డిస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వృద్ధులకు రక్షణగా అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్‌ అన్నారు. శనివారం ఆయన నగరంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించడంతో పాటు ఆయన కూడా రుచి చూశారు. అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకుని వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా ఆశ్రమానికి వచ్చే పారాలీగల్‌ వాలంటీరుకు తెలియజేస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు అందకపోయినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని