‘చట్టం వైకాపాకు చుట్టమా?’
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

‘చట్టం వైకాపాకు చుట్టమా?’


సమావేశంలో మాట్లాడుతున్న గోపు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో చట్టాలు వైకాపాకు చుట్టాలా అన్నట్టుగా తయారయ్యాయని మచిలీపట్నం పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నివాసగృహాన్ని రైతులు ముట్టడిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వైకాపా పాలకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు చర్చించాల్సిన కేబినెట్‌ సమావేశంలో పీకే టీమ్‌, ఎన్నికల్లో గెలుపోటములు గురించి చర్చించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించాల్సిన విషయాన్ని గ్రహించిన ప్రజలు అందుకోసం ఎదురుచూస్తున్నారన్నారు. పార్టీ ప్రచార కార్యదర్శి పీవీ ఫణికుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని