ప్రజా సమస్యలపై స్పందించిన మంత్రి
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

ప్రజా సమస్యలపై స్పందించిన మంత్రి


సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: చట్ట ప్రకారం అర్హత ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. మచిలీపట్నంలోని ఆయన నివాసగృహానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బందరు మండల పరిధిలోని పల్లెతుమ్మలపాలెం గ్రామంలో సీసీ రహదారులు ఏర్పాటు చేయాలని, మంచినీటి కుళాయిలు వేయించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లి తెచ్చిన సరకు ఎండబెట్టుకోవడానికి, వలలు శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫాం నిర్మించాలని మాజీ సర్పంచి దుర్గయ్య వినతిపత్రం అందజేశారు. గృహ నిర్మాణ పథకం ద్వారా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని శారదానగర్‌కు చెందిన పురుషోత్తం, తన కుమార్తెను బీటెక్‌లో చేర్పించేందుకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటర్‌ చదివిన కార్పొరేట్‌ కళాశాల నుంచి ఇప్పించాలని గొడుగుపేటకు చెందిన నారాయణ, దివ్యాంగురాలైన తన కుమార్తెకు 11 ఏళ్ల నుంచి పింఛను ఇస్తూ ప్రస్తుతం 24 ఏళ్ల వయసు వచ్చాక నిలిపివేశారని, పునరుద్ధరించేలా చూడాలని బందరుకు చెందిన శాలినీకుమారి కోరారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని