మానవత్వం చాటిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

మానవత్వం చాటిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌


వృద్ధురాలితో మాట్లాడుతున్న కానిస్టేబుల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలి విషయంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చూపిన ఔదార్యం పలువురి ప్రశంసలు అందుకుంది. నగరంలోని మూడు స్తంభాల కూడలి వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ రాధాకృష్ణ వద్దకు వచ్చిన ఓ యువకుడు సుల్తానగరం పైవంతెన వద్ద ఓ వృద్ధురాలు ఉదయం నుంచి మండుటెండలో రహదారి మధ్యలో డివైడర్‌పై పడి ఉన్నట్టు తెలియజేశాడు. మానవతా దృక్పథంతో స్పందించిన కానిస్టేబుల్‌ ఆ యువకుడిని వెంటబెట్టుకుని వృద్ధురాలి వద్దకు వెళ్లగా మాటలు రాని స్థితిలో అచేతనంగా ఉండటాన్ని గమనించారు. తమకెందుకులే అని వదిలేయకుండా ఓ ఆటోలో ఆమెను నీడకు చేర్చి మంచినీరు, ఆహారం అందించారు. కాస్త తెప్పరిల్లిన తరువాత ఆమె బాగోగులు చూసుకోమని స్థానికులకు చెప్పి వెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని