సంఘ బలోపేతానికి కృషిచేయాలి
eenadu telugu news
Published : 19/09/2021 01:44 IST

సంఘ బలోపేతానికి కృషిచేయాలి


ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: సంఘ బలోపేతానికి సభ్యులందరూ సమష్టిగా కృషి చేయాలని ఎన్నికల అధికారి, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్‌ కోరారు. ముదినేపల్లిలో శనివారం ఏపీటీఎఫ్‌ మండల శాఖ ఎన్నిక నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ పదవిని బాధ్యతగా నిర్వహించాలని, నిబద్ధతతో పనిచేయాలని, ఉపాధ్యాయులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మండలాధ్యక్షుడిగా మరోసారి ఆగొల్లు హరికృష్ణను, ప్రధాన కార్యదర్శిగా బి.జాన్సన్‌బాబు, గౌరవాధ్యక్షుడిగా సీహెచ్‌.చక్రధర్‌, ఉపాధ్యక్షులుగా ఎం.జయశ్రీలత, పి.శ్రీనివాస్‌, శ్రీహరి, జె.జయలక్ష్మిని ఎన్నుకొన్నారు. కార్యదర్శులుగా డి.వెంకటరత్నం, వి.శివ, వి.సూర్యప్రకాశరావు, ఎం.వెంకటలక్ష్మి, కోశాధికారిగా రెడ్డి శ్రీనివాస్‌, జిల్లా కౌన్సిలర్లుగా వి.ప్రసన్నకుమారి, డి.షర్మిలాదేవి, కె.హరిబాబు, టీ.వేణు, సీవీఎల్‌ నరసింహారావు, డీవీ.నరసయ్య, నాగమల్లేశ్వరరావు, డి.రవికుమార్‌, వీరపాపలను, సభ్యులుగా పలువురిని ఎన్నుకొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని