రింగ్‌ బండ్‌ పనుల తనిఖీ
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

రింగ్‌ బండ్‌ పనుల తనిఖీ

పనులను పరిశీలిస్తున్న పీడబ్ల్యూడీ డీఈ సత్యనారాయణ,

పక్కన ఏఈ కిషోర్‌ తదితరులు

వినగడప(గంపలగూడెం): మండలంలోని వినగడప రాళ్ల చెరువు కట్టకు పడిన గండి వద్ద రింగ్‌ బండ్‌ నిర్మాణ పనులను పీడబ్ల్యూడీ డీఈ ఎన్‌.సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. గత నెలలో వచ్చిన గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి కట్టకు గండి పడిన సంగతి తెల్సిందే. కట్ట వద్ద తాత్కాలిక మరమ్మతులకు జిల్లా కలెక్టర్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. 90 మీటర్ల పొడవున ఉన్న గండ్లకు రింగ్‌ బండ్‌ నిర్మాణ పనులు గత వారం ప్రారంభించారు. ప్రస్తుతం రింగ్‌ బండ్‌ నిర్మించారు. ఇసుక బస్తాలు వేయించాల్సి ఉంది. ఏఈ వి.కిషోర్‌, వైకాపా నేతలు ఎం.దివ్యనాగమల్లేశ్వరరావు, పి.ఆంజనేయులు, ఎం.రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని