స్పందనను సద్వినియోగం చేసుకోండి
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

స్పందనను సద్వినియోగం చేసుకోండి

కార్యాలయ ప్లాన్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రోజూ స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ సూచించారు. నందిగామ, నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలోని వారి కోసం ప్రత్యేకంగా ప్రతి బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన ద్వారా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మైలవరానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడు తనను ఇంటి నుంచి గెంటివేసి నిలువనీడ లేకుండా చేయడంతో పాటు తినడానికి తిండికూడా పెట్టడం లేదంటూ విలపిస్తూ న్యాయం చేయాలని కోరారు. విస్సన్నపేటకు చెందిన వ్యక్తి తన భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో న్యాయస్థానంలో కేసు నడుస్తోందని, ఆమె తరపు వారు తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. పలువురు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో వారికి తగు పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

డీఎస్పీ కార్యాలయ స్థలం సందర్శన

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: జిల్లా పోలీస్‌ కార్యాలయ సమీపంలో బందరు డీఎస్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనుల పురోగతిపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆరా తీశారు. ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి బుధవారం డీఎస్పీ కార్యాలయ స్థలాన్ని సందర్శించారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన ఆయన భవన నిర్మాణ ప్లాన్‌ను చూసి పలు సూచనలు చేశారు. డీఎస్పీలు మాసుంబాషా, రాజీవ్‌కుమార్‌, భరత్‌మాతాజీ, తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.

డీజీపీ కాన్ఫరెన్స్‌కు హాజరు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: కరోనాతో మృతిచెందిన పోలీస్‌ కుటుంబాల సంక్షేమంపై డీజీపీ గౌతంసవాంగ్‌ వర్చువల్‌ విధానంలో బుధవారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ హాజరయ్యారు. అనంతరం మాన్‌కైండ్‌ ఫార్మా లిమిటెడ్‌ రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన పోలీస్‌ సిబ్బందికి అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని చిల్లకల్లు స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తూ మృతిచెందిన బి.ప్రసాదరావు కుటుంబసభ్యులకు అందజేశారు. ఫార్మాలిమిటెడ్‌ సమకూర్చిన రూ.3 లక్షల చెక్కును ప్రసాదరావు సతీమణి లక్ష్మికి ఎస్పీ ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని