పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌, సోషల్‌ పాఠ్యాంశ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉన్నాయని వాటిని పరిగణనలోకి తీసుకుని సరిచేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.లెనిన్‌బాబు, ఎ.సుందరయ్యలు ఒక ప్రకటనలో కోరారు. డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన జాబితాలో 2019, 2020 సంవత్సరాల్లో రెండుసార్లు రీలింక్విష్‌ ఇచ్చిన వారి పేర్లు చూపాలని, వారు పదోన్నతికి అనర్హులు అని అన్నారు. అలాంటి వారి పేర్లు పదోన్నతుల జాబితాలో చూపిస్తున్నారని అనర్హులవి తొలగించి పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ధ్రువపత్రాల పరిశీలన: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం (తెలుగు), ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం (ఉర్దూ), స్కూల్‌అసిస్టెంట్‌ (సోషల్‌)కు సంబంధించి ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని