‘దోషులను శిక్షించాలి’
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

‘దోషులను శిక్షించాలి’

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు ఎంఎల్‌ఎస్‌ గోదాముల్లో ప్రజలకు చేరాల్సిన నిత్యావసరాల నిల్వలో చోటుచేసుకున్న కుంభకోణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు జయమంగళ వెంకట రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కుంభకోణం తనిఖీకి వచ్చిన అధికారులనే నివ్వెరపరిచిందని, దీనిలో పలువురు జిల్లాస్థాయి అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీన్ని కప్పిపుచ్చేందుకే అంతకు ముందు తనిఖీలు చేసి వ్యత్యాసాలు గమనించి, సరకు నిల్వల దస్త్రాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. గోదాముల బాధ్యుడు, హమాలీల వద్ద రికార్డులు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గుడివాడ రెవెన్యూ డివిజన్‌లో భాగమైన కైకలూరులో ఇంత తంతు జరుగుతున్నా పక్కనే ఉన్న పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సంబంధిత శాఖాధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కుంభకోణానికి మంత్రి కొడాలి నాని పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టరుతో సమగ్ర విచారణ చేయించి, దోపిడీదారులను కఠినంగా శిక్షించాలన్నారు.లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు సమాచారహక్కు చట్టం ఆయుధంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో సయ్యపరాజు గుర్రాజు, పెనుమత్స త్రినాధరాజు, పోలవరపు లక్ష్మీరాణి, పంది రాధాకృష్ణ, ఎండీ జానీ, బలేస్వామి, మాల్యాద్రి, బాషీద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని