మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడదాం
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడదాం

సమావేశంలో మాట్లాడుతున్న మేనేజరు మనోజ

తిరువూరు, న్యూస్‌టుడే: పట్టణంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, జైభావిసెంటర్‌లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని పురపాలక సమవేశంలో చేసిన ప్రతిపాదనలపై ఫ్లోర్‌లీడర్‌ ఎస్‌కే అబ్దుల్‌హుస్సేన్‌, తెదేపా సభ్యులు నాళ్లా సురేంద్ర, జీడిమళ్ల సత్యవతి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ జి.కస్తూరిబాయి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. మసీదు, శివాలయం, జెండా చెట్టు సమీపంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద, బహిరంగ మార్కెట్‌లో అత్యధిక విలువ పలుకుతున్న జైభావిసెంటర్‌ స్థలంలో మరుగుదొడ్లు ఎలా నిర్మిస్తారని, అనువైన స్థలాల్లో నిర్మించడానికి స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పట్టణంలో కుక్కలు, పందులు, కోతులు స్వైరవిహారంతో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రధాన రహదారిలో తిష్టవేస్తున్న ఆవుల వల్ల వాహన చోదకులు అవస్థలు పడుతున్నారని, వాటి యజమానులకు నోటీసులు జారీచేసి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మేనేజరు మనోజ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ, వైస్‌ ఛైర్మన్లు వి.విజయలక్ష్మి, జి.వెంకటేశ్వరి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని