అటవీ భూముల్లో చెరువు తవ్వకాలకు అడ్డుకట్ట
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

అటవీ భూముల్లో చెరువు తవ్వకాలకు అడ్డుకట్ట

ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ఎస్సై గణేష్‌కుమార్‌

ఇంతేరు (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం చేపట్టిన చెరువు తవ్వకాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గూడూరు మండలానికి చెందిన కొందరు అటవీ భూముల్లో అక్రమంగా చెరువు తవ్వుతున్నారనే సమాచారం మేరకు గ్రామస్థులు ఘటనాస్థలానికి వెళ్లి రెండు పొక్లెయిన్లు గుర్తించారు. ఆర్‌ఎస్‌ నెంబరు 94లో ఒకచోట 50ఎకరాలు, మరోచోట 60 ఎకరాలు తవ్వకాలు చేపడుతున్నట్లు గ్రహించి తవ్వకాలను అడ్డుకున్నారు.దీంతో గ్రామస్థులు, ఆక్రమణదారులకు మధ్య వాగ్వాదం తలెత్తి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు పొక్లెయిన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని తహసీల్దార్‌ మైనర్‌బాబు, ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ అటవీ భూముల జోలికి పోవద్దని తహసీల్దారు హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని