ఓటుహక్కు వజ్రాయుధం వంటిది
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

ఓటుహక్కు వజ్రాయుధం వంటిది

పెడనలో డిగ్రీ విద్యార్థులతో కలిసి అధికారుల ర్యాలీ

పెడన: ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బుధవారం పెడనలో డిగ్రీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ పి.మధుసూదనరావు మాట్లాడుతూ ఓటుహక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ (ఎన్నికలు) కల్పన, సీనియర్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌, వీఆర్‌వో షాకీరుల్లా తదితరులు పాల్గొన్నారు.

కైకలూరు: ఓటుహక్కు వజ్రాయుధం లాంటిందని తహసీల్దార్‌ సాయి కృష్ణకుమారి అన్నారు. డీటీ (ఎన్నికలు) ఎండీ ఇబ్రహీం ఆధ్వర్యంలో తాలూకా కూడలిలో విద్యార్ధులతో కలిసి ఓటుహక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యాంజలి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని